ప్రముఖ చారిత్రక నవలా రచయిత ప్రొఫెసర్ ముదిగొండ శివ ప్రసాద్ గుండె పోటుతో విద్యా నగర్ లోని ఆంధ్ర మహిళా సభ లోని హాస్పిటల్ లో గురువారం రాత్రి 8.30 గంటలకు మృతి చెందారు ఆయన వయసు 86 సంవత్సరాలు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు భార్య కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు ఉస్మానియా విశ్వవిద్యాలయం లో తెలుగు శాఖ లో ప్రొఫెసర్ పని చేసి విశ్రాంత జీవితం లో పలు పరిశోధనాత్మక చారిత్రిక నవలలు రాసారు ఇండియన్ గ్రీక్ సంస్కృతి ల సామ్యం పై PhD చేసిన శివ ప్రసాద్ నవలలు పై సుమారు ముఫ్ఫై మంది విద్యార్థులు PhD లు చేశారు అయన నవలల్లో శ్రీలేఖ తంజావూరు విజయం శ్రీ పదార్చన ప్రసిద్ధి పొందాయి ఆయన అంత్యక్రియలు అంబర్ పేట లోని శ్మశాన వాటిక లో శుక్ర వారం జరుపు తామనీ కుటుంబ సభ్యులు తెలిపారు.
చారిత్రక నవలా రచయిత ప్రొఫెసర్ ముదిగొండ శివ ప్రసాద్ మృతి
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)