Magazines

పత్తి కొనుగోళ్లపై ఎల్‌‌నినో ప్రభావం

2 గంటల క్రితం

cotton procurement
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 2 నిమిషాల చదవడం

మొదటి రోజు క్వింటాల్‌‌కు రూ.9,260
మద్దతు ధరకన్నా ఎక్కువ పలికిన ప్రయివేటు వ్యాపారులు

ఆదిలాబాద్‌ ‌మార్కెట్‌‌లో కొనుగోళ్లను ప్రారంభించిన కలెక్టర్‌

​‌క్వింటాల్‌ ‌పత్తికి రూ.12 వేలు ఇవ్వాలని సీపీఐ(ఎం) డిమాండ్‌

నవతెలంగాణ - ఆదిలాబాద్‌ ‌ప్రాంతీయ ప్రతినిధి

పత్తి దిగుబడులపై ఎల్‌‌నినో తీవ్ర ప్రభావం చూపింది. చరిత్రలో తొలిసారి ఆదిలాబాద్‌ ‌వ్యవసాయ మార్కెట్‌ ‌యార్డుకు పత్తి బండ్లు తక్కువ వచ్చాయి. పత్తి కొనుగోళ్ల ప్రారంభం రోజే సుమారు 200 వరకు వాహనాల్లో రైతులు పంటను తెచ్చేవారు. ఈ సారి 30 వాహనాలు మాత్రమే రావడంతో జిల్లాలో పత్తి దిగుబడులు పూర్తిగా పడిపో యాయని స్పష్టమవుతోంది. ప్రతిసారీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర విష యంలో రైతులకు అధికారులకు మధ్య వా గ్వాదం చోటుచేసుకునేది. ఈసారి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకన్నా ఎక్కువ పలకడంతో ప్రశాంత వాతావరణంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు క్వింటాల్‌‌కు రూ.9,260 ధర పలికింది. అయితే, వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, క్వింటాల్‌ ‌పత్తికి రూ.12 వేలు ఇవ్వాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ ‌చేసింది. ఆదిలాబాద్‌ ‌వ్యవసాయ మార్కెట్‌‌లో గురువారం కలెక్టర్‌ ‌రాజర్షిషా పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.8,667కాగా.. ముందుగా ప్రయివేటు వ్యాపారులు వేలం ద్వారా క్వింటాల్‌ ‌పత్తి రూ.9,260 ప్రకటించారు. 8 శాతం తేమ మించకుండా ఉంటే పత్తి కొనుగోలు చేస్తామ నడంతో రైతులు ఒప్పుకోవడంతో కొనుగోళ్లను కలెక్టర్‌ ప్రారంభించారు. వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నాయకుల సమక్షంలో ప్రయివేటు వ్యాపారులు వేలం నిర్వహించారు. పత్తిలో తేమ శాతం ‌తక్కువ ఉండేలా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అయితే, ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ప్రయివేటు వ్యాపారులు ఇస్తున్న ధర కూడా తక్కువేనని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్‌ శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ ‌చైర్‌‌పర్సన్‌ ‌బండారి అనూష, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ మల్లెపూల నర్సయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానన్, డీఎస్పీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.

​వెలవెలబోయిన మార్కెట్‌

ఆదిలాబాద్‌ ‌వ్యవసాయ మార్కెట్‌‌లో తొలిరోజు సాయంత్రం వరకు 50 పత్తి పంట వాహనాలు మాత్రమే వచ్చాయి. ప్రతి యేటా ప్రారంభం రోజు 7వేల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు అయితే ఈసారి 700 క్వింటాళ్లు కూడా జరగలేదని మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు.

​పడిపోయిన దిగుబడులు

జిల్లాలో ప్రతి యేటా ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడులు వచ్చేవి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి 4 నుంచి 6 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. నల్లరేగడి భూముల్లో 4 నుంచి 6 క్వింటళ్ల వరకు రాగా.. చల్క భూమిలో కేవలం 2 నుంచి 3 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో 4.37 లక్షల ఎకరాల పత్తి సాగు విస్తీర్ణం కాగా.. 52 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వస్తాయని అధికారుల అంచనా వేశారు. ఈసారి ఎల్‌‌నినో ప్రభావం వల్ల కనీసం 12లక్షల క్వింటాళ్ల దిగుబడులు కూడా వస్తాయనే నమ్మకం లేదని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

​క్వింటాల్‌‌కు రూ.12వేలు ఇవ్వాలి

దర్శనాల మల్లేష్‌, సీపీఐ(ఎం) ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శి వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ధర వచ్చిందనడం సరికాదు. ఇదివరకు ఖమ్మం జిల్లాలో రూ.10 వేలు పలికినట్టు సమాచారం. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. పత్తి పంట దిగుబడులు పూర్తిగా పడిపోయినందున క్వింటాల్‌ ‌పత్తికి రూ.12 వేలు ఇవ్వాలి. నాణ్యత ఆధారంగా మరింత పెంచాలి. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్