మృతదేహంపై పూలమాలవేసి
శ్రద్దాంజలి ఘటించిన సీజీఎం
నవతెలంగాణ- సిటీ బ్యూరో
‘నవతెలంగాణ’ దినపత్రిక హైదరాబాద్ సిటీ రీజియన్ స్టాపర్ పి. రత్నాకర్‌రావు మాతృమూర్తి సరళాదేవి మృతదేహానికి గురువారం నవతెలంగాణ యాజమాన్యం ఘనంగా నివాళులర్పించింది. సరళాదేవి బుధవారం మృతిచెందిన విషయం తెలిసిందే. సిద్దిపేట పట్టణంలోని చర్చ్ కాంపౌండ్‌లో గల సీఎస్‌ఐ చర్చిలో ఉంచిన ఆమె మృతదేహానికి నవతెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) పి. ప్రభాకర్, జనరల్ మేనేజర్లు వి. లింగారెడ్డి, నరేందర్‌రెడ్డి, మొఫిసిల్ ఇన్‌చార్జి జి.వేణుమాధవ రావు, సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రత్నాకర్‌రావును, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పాస్టర్ ఆంటోని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక సీఎస్‌ఐ శ్మశానవాటికలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు బట్టిపాటి రాజశేఖర్, సీనియర్ జర్నలిస్టులు ప్రియకుమార్, మాధవరెడ్డి, నవతెలంగాణ సిద్దిపేట డివిజన్ ఇన్‌చార్జి యాదగిరి, సీనియర్ విలేకరి శ్రీనివాస్‌తో పాటు సిబ్బంది, స్థానిక విలేకరులు, బంధువులు పాల్గొని సరళాదేవికి వీడ్కోలు పలికారు.






కామెంట్‌లు (0)