Magazines

విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ.3 వేల కోట్ల కుంభకోణం

1 గంట క్రితం

scam under the guisescam under the guise
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 2 నిమిషాల చదవడం

స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలి : సీఎం రేవంత్‌‌రెడ్డికి కేటీఆర్‌ ‌బహిరంగ లేఖ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో రూ.మూడు వేల కోట్ల భారీ కుంభకోణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) ఆరోపించారు. విదేశీ బొగ్గు దిగుమతిని ఆపాలనీ, ఈ అంశంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డికి గురువారం కేటీఆర్‌ ‌బహిరంగ లేఖ రాశారు. భోత్రా లాజిస్టిక్స్ అనే అనుమానాస్పద కంపెనీతో ముందే సీఎం రేవంత్‌‌రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కావాలనే కృత్రిమ బొగ్గు కొరత, కరెంట్ సంక్షోభం సృష్టించి అదనుచూసి ఆ కంపెనీని రేవంత్‌‌రెడ్డి రంగంలోకి దింపారని విమర్శించారు. భోత్రా లాజిస్టిక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి చేసుకున్న అన్ని రహస్య ఒప్పందాలను బయటపెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. ఏ ప్రాతిపదికన సదరు కంపెనీని ఎంపికచేశారో సీఎం సమాధానం చెప్పాలని కోరారు. విదేశీ బొగ్గు దిగుమతి పేరిట సింగరేణికి మరణశాసనం రాస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్-బీజేపీ కలిసి చేస్తున్న ఈ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు సరఫరా చేసేందుకు సింగరేణిలో జీ9 బొగ్గు లేదని అబద్ధాలు చెప్పడం సరైంది కాదని పేర్కొన్నారు. సింగరేణి సంస్థకు రూ.60 వేల కోట్ల బాకీ చెల్లించకుండా సంస్థను కుప్పకూల్చే కుతంత్రం చేస్తున్నారని విమర్శించారు. దేశీయ సంస్థలను పక్కనపెట్టి కమీషన్ల కోసమే విదేశీ బొగ్గు కోసం వెంపర్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల ముసుగులో ప్రతి టన్నుపై రూ.1,500 చొప్పున ఏకంగా

రూ.మూడు వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్‌‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. అడ్డుకోవాల్సింది పోయి సహకరిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని బలహీనపరిచి విదేశీ బొగ్గు దిగుమతికి జరుగుతున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్