సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు,
మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
ఆదర్శ కమ్యూనిస్టు లక్ష్మారెడ్డి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్
నవతెలంగాణ
కొమ్మిడి లక్ష్మారెడ్డి ఆశయ సాధనకు పునరంకితం కావాలని, అప్పుడే ఆయన ఆశయాలను సాధించిన వారవమవుతామని సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో అమరజీవి కొమ్మిడి లక్ష్మారెడ్డి సంతాప కార్యక్రమం నిర్వహించారు. కొమ్మిడి చిత్రపటానికి పలువురు పూలమాలలు లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ కొమ్మిడి లక్ష్మారెడ్డి నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుగా అనేక ఒడిదడుకులు, ఇబ్బందులు వచ్చినా వెనక్కు తగ్గకుండా చిన్నతనంలో పట్టిన ఎర్రజెండాను చివరిదాకా మోసిన గొప్ప త్యాగశీలి అన్నారు. పార్టీకి, పులిగిల్ల గ్రామ అభివృద్ధి కోసం తన చివరి శ్వాస వరకు కృషి చేశారన్నారు. ప్రజా ప్రతినిధిగా నాయకునిగా పార్టీకి ప్రతిష్ట తెచ్చి పెట్టారని, ఆయన ఆశయ సాధనకు నేటి యువత ముందుకు వచ్చి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరన్నారు. లక్ష్మారెడ్డి ఆదర్శాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత పులిగిల్ల గ్రామంలోని ప్రతి కమ్యూనిస్టు కార్యకర్తపై ఉందన్నారు.
ఆదర్శ కమ్యూనిస్టు లక్ష్మారెడ్డి
చివరి శ్వాస వరకు ఆదర్శ కమ్యూనిస్టుగా కొమ్మిడి లక్ష్మారెడ్డి జీవించారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి. జహంగీర్ అన్నారు. నమ్మిన సిద్ధాంతం, ఎత్తిన ఎర్రజెండా కోసం అనేక కస్టాలను ఎదుర్కొని నిలబడిన నాయకుడన్నారు. ప్రజాప్రతినిధిగా పార్టీ నాయకుడుగా విలువలకు కట్టబడి పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. రైతులు, కూలీలు, కార్మికులు, కష్టజీవుల పక్షాన అనేక పోరాటాలు నడిపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, బూరుగు కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, మేక అశోక్ రెడ్డి, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, ఎండి పాషా, గణపతి రెడ్డి, కోట రామచంద్రారెడ్డి, నాయకులు మామిడి వెంకట్ రెడ్డి, తుర్కపల్లి సురేందర్, వాకిటి వెంకటరెడ్డి, కూర శ్రీనివాస్, కందడి సత్తిరెడ్డి, బండారు నరసింహ, మొగిలిపాక గోపాల్, కల్కూరి రామచందర్, కవిడే సురేష్, కల్కూరి ముత్యాలు, కొండే కిష్టయ్య, కర్ణకంటి యాదయ్య, దొడ్డి బిక్షపతి, వరికుప్పల యాదయ్య పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)