Magazines

సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

25 నిమిషాల క్రితం

entertainer
avatar
balaji

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో నాని తన యునానిమస్ ప్రొడక్షన్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. 'అలియాస్ రుక్మిణి' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ విడుదల చేసిన కొత్త ప్రమోషనల్ వీడియోలో నితిన్‌ను కృష్ణగా సరికొత్త అవతార్‌లో పరిచయం చేశారు. రుక్మిణి తన ప్రపంచంలోకి రాకముందు కృష్ణ జీవితం ఎలా ఉండేది? అనే ఆసక్తికరమైన అంశాన్ని ఈ వీడియో ద్వారా చూపించారు. ఇప్పటికే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ ‘రుక్కు రుక్కు రుక్మిణి’తో ప్రారంభించారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్‌లో రుక్మిణిపై కృష్ణకు ఉన్న ప్రేమను అందంగా ఆవిష్కరించారు. ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది అని మేకర్స్‌ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్