Magazines

‘ధర్మన్‌’లో కీలక పాత్ర

1 గంట క్రితం

Dharman
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

రజనీకాంత్ ‘ధర్మన్’ సినిమా నుంచి మేకర్స్ మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లో లేడీ సూపర్‌స్టార్ నయనతార చేరినట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సమర్పణలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌ను కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తుండగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్, నయనతార కలిసి నటించడం ఇది ఐదోసారి. గతంలో వీరిద్దరూ ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’, ‘దర్బార్’, ‘పెద్దన్న’ సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు ‘ధర్మన్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ క్రేజీ పెయిర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

విభిన్నమైన కథాంశం, టాప్ స్టార్స్ కలయికతో వస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, ఎడిటింగ్ : ప్రదీప్ ఈ. రాఘవ్, యాక్ష‍న్‌: అన్బరివ్.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్