Magazines

జెన్ జీకి కనెక్ట్ అయ్యే సినిమా

7 నిమిషాల క్రితం

Gen Z
avatar
balaji

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పలు విజయవంతమైన సినిమాలకు కో-రైటర్‌గా పనిచేసిన ఎస్ కృష్ణ, ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 27న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ, 'ఈ సినిమా నేను చూశాను. సాయి చాలా కొత్తగా ప్రయత్నించాడు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్‌తో జెన్జీ ఆడియన్స్‌కు కనెక్ట్ చేయాలని చాలా బాగా కష్టపడ్డాడు. తను ఇన్ఫ్లూయన్సర్స్ కోసం రిలీజ్‌కు ముందే ఒక షో వేయబోతున్నాడు. తప్పకుండా అది తనకు మంచి రిజల్ట్ ఇస్తుంది. తనకు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


ఈ నెల 27న రిలీజ్ కాబోతోంది. ఇది చిన్న సినిమా కావచ్చు. కాకపోతే చాలా పెద్ద స్కేల్‌లో తీశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాను' అని అన్నారు. డైరెక్టర్, హీరో ఎస్ కృష్ణ మాట్లాడుతూ,'ఒక సినిమాను సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. నేను కూడా డైరెక్టర్‌ని కాబట్టి అది నాకు తెలుసు. నేను యాక్టర్ కావడం మా నాన్న కల. నేను డైరెక్షన్ చేస్తున్న సినిమాకు నన్ను ఒక పాత్ర చేయమని అనిల్ నన్ను బూస్ట్ చేశాడు. మా నాన్న కల ఈ సినిమా ద్వారా తీరుతుంది. ఈ సినిమాను అందరూ చూసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు. హీరోయిన్‌ అనన్య శర్మ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో లిప్‌స్టిక్ లావణ్య క్యారెక్టర్ ప్లే చేశాను. ఇది నాకు చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్. అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్' అని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్