Magazines

సీపీఐ(ఎం) నేత, కేరళం మాజీ సీఎం ఈఎంఎస్‌ కుమార్తె రాధ కన్నుమూత

9 నిమిషాల క్రితం

daughter of CPI(M) leader
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

తిరువనంతపురం : కమ్యూనిస్టు యోధులు, కేరళం మాజీ ముఖ్యమంత్రి ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ‌కుమార్తె ఈఎం రాధ(70) ఆదివారం కన్నుమూశారు. తిరువనంతపురంలోని ఆస్పత్రిలో ఆమె కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఈఎంఎస్‌ ‌నలుగురు పిల్లల్లో చిన్నవారు. కేరళం రాష్ట్ర వృద్ధుల కమిషన్‌ సభ్యు రాలిగా ఆమె వున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌‌ సభ్యురాలిగా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలంగా పార్టీ సభ్యురాలిగా వున్న ఆమెకు దేశాభిమాని పత్రికతో విస్తృత మైన అనుబంధం వుంది. 1981లో సీనియర్‌ ‌క్లర్క్‌‌గా చేరి, 2012లో అడ్మిని స్ట్రేషన్‌ ‌విభాగ మేనేజర్‌‌గా పదవీ విరమణ చేశారు. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో చాలా చురుకుగా వ్యవహరించేవారు. తన తండ్రిపై ‘ఈఎంఎస్‌ : కుమార్తెగా జ్ఞాపకాలు’ అనే పుస్తకాన్ని రచించారు. రాధ మృతి వార్త తెలిసిన సీఎం వీడీ సతీశన్‌, ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌‌లు సంతాపం తెలియచేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్