Magazines

భారత్ చేరుకున్న నేపాల్‌ ప్రధాని

9 నిమిషాల క్రితం

arrives
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 2 నిమిషాల చదవడం

నేడు మోడీతో భేటీ

న్యూఢిల్లీ : రెండు రోజుల అధికారిక పర్యటన కోసం నేపాల్‌ ‌ప్రధానమంత్రి బాలేంద్ర షా ఆదివారం మధ్యాహ్నం భారత్‌‌కు చేరుకున్నారు. న్యూఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్‌ ఆయనకు స్వాగతం పలికారు. నేపాల్ ఎయిర్‌లైన్స్ నడిపే సాధారణ వాణిజ్య విమానంలో ఈ పర్యటనకు బాలేంద్ర షా రావడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో నేపాల్‌ ‌ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత షాకు ఇది మొదటి అధికారిక ద్వైపాక్షిక విదేశీ పర్యటన. అయితే ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు సెప్టెంబర్‌లో అమెరికాకు షా వెళ్లారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఈ పర్యటనకు షా విచ్చేశారు. షాతో పాటు ఆయన ముఖ్య సలహాదారు కుమార్ బ్యంజంకర్, నేపాల్‌ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే, విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్‌లతో కూడిన 34 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఈ పర్యటనలో పాల్గొంటుంది. ఈ ప్రధానమంత్రి ప్రతినిధి బృందంతో పాటు ఒక ప్రత్యేక వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనకు వచ్చింది. ఆదివారం సాయంత్రం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీతో షా భేటీకానున్నారు. రాజ్‌ఘాట్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి మహాత్మా గాంధీకి షా నివాళులర్పిస్తారు.

ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా, ఇరు దేశాల నాయకులు భారత్-నేపాల్ సంబం ధాల పూర్తి స్థాయిని సమీక్షించి, పరస్పర ప్రయోజనాలు ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే, ఇద్దరు ప్రధానమంత్రులు కొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్య క్రమాలు నిర్వహించడంతో పాటు, ఇప్పటికే పూర్తయిన అనేక కార్యక్ర మాలను వర్చువల్‌గా ప్రారంభి స్తారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, ప్రకృతి వైపరీత్యాలు-వాతావరణ మార్పు వంటి సమస్యలను పరిష్కరించడం.. మొదలై అంశాలపై కూడా ఈ పర్యటనలో చర్చలు జరగనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్