Magazines

ప్రాజెక్ట్‌ మాకు ఫోన్‌ చేయండి

8 నిమిషాల క్రితం

Project
avatar
balaji

ప్రచురించబడింది నవం 22, 2026 | 2 నిమిషాల చదవడం

గర్భిణులు, నవజాత శిశువులు, చిన్న పిల్లల ఆరోగ్యంపై సందేహాల నివృత్తి : ఎస్వీకే వెబినార్‌లో డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌

నవతెలంగాణ - హైదరాబాద్‌ బ్యూరో
గర్భిణులు, నవజాత శిశువులు, చిన్న పిల్లల ఆరోగ్యంపై వచ్చే సందేహాల నివృత్తి కోసం 'ప్రాజెక్ట్‌ మా' ను సంప్రదించాలని కామినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ తెలిపారు. ఫోన్‌ నెంబర్‌ 8448820700 ద్వారా 'ప్రాజెక్ట్‌ మా'లో 12 ఏండ్లలోపు పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఏఐ ద్వారా సమాధా నాలు లభిస్తాయని వివరించారు. దీన్ని సంపూర్ణంగా తమ వైద్య విజ్ఞానం ద్వారానే రూపొందించామనీ, ప్రజలంతా ఉచితంగా ఈ సేవల్ని పొందవచ్చని చెప్పా రు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యం లో 'నవజాత శిశువులు, చిన్న పిల్లల ఆరోగ్యంపై అపోహలు-వాస్తవాలు' అంశంపై జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. నవజాత శిశువులకు తొలి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. ఆ దశలో శిశువులకు ఎలాంటి అదనపు ఆహారం ఇవ్వరాదన్నారు. పిల్లల్ని మొబైల్‌ ఫోన్లకు దూరంగా ఉంచాలనీ, వారికి బలవంతంగా ఆహారం తినిపించొద్ద ని తెలిపారు.


చిన్న పిల్లలకు అరటిపండ్లు పెడితే జలుబు చేస్తుందని ఫిర్యాదులు సహజంగా వస్తుంటాయనీ, కానీ అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. పండ్లు తినడం వల్ల దగ్గు, జలుబు రావనీ, వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వల్లే వస్తాయని వివరించారు. అలాగే ఆహారం తిన్న వెంటనే పిల్లలు విరోచనాలు చేస్తున్నారనీ, దానివల్ల బరువు పెరగట్లేదనే అపోహలు వద్దన్నారు. పిల్లలకు 12 ఏండ్లు వచ్చే వరకు ఏది తిన్నా రెండు గంటల్లో విరోచనాలకు వెళ్తారనీ, ఈ విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. పిల్లలు వయసును బట్టి బరువు, ఎత్తు పెరుగుతారనీ, ఆ క్రమంలో కాళ్ల నొప్పులు సహజంగా వస్తాయనీ, అవి వారి ఎదుగుదలలో భాగంగా వచ్చేవేననీ స్పష్టం చేశారు. దాన్ని సమస్యగా ఫీల్‌ కావల్సిన అవసరం లేదనీ, చిన్న మసాజ్‌ చేస్తే రిలీఫ్‌ వస్తుందని తెలిపారు. పిల్లలకు 15 ఏండ్లు వచ్చే వరకు వివిధ దశల్లో తప్పనిసరిగా వ్యాక్సిన్లు (టీకాలు) వేయించాలని చెప్పారు. టీకాల వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో లభించని టీకాలను కూడా పిల్లలకు ఇప్పించాలని సూచించారు. చికెన్‌ ఫాక్స్‌, హైపటైటస్‌-ఏ, ఇన్‌ఫ్లుయెం జా వంటి టీకాలు కూడా ఇప్పించాలని సూచించారు. కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్