Magazines

బిస్లరీ వాటర్ అసురక్షితం

10 నిమిషాల క్రితం

Bisleri
avatar
balaji

ప్రచురించబడింది నవం 22, 2026 | 2 నిమిషాల చదవడం

నిర్దేశిత ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధమైన పదార్థాలు : ఎఫ్ఎస్ఎస్ఏఐ

గతంలో సేల్ డీల్ విఫలం..
ఇపుడు బీజేపీ నేతలే చక్రం తిప్పారా! వ్యాపారవర్గాల్లో చర్చ


న్యూఢిల్లీ: ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లెరీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీకి చెందిన నీటి నమూనాలో నిర్దేశిత ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధమైన పదార్థాలు గుర్తించినట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చట్టపరమైన చర్యలకు అనుమతి మంజూరు చేసింది.ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. కంపెనీ నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాను పరీక్షించగా, అందులో బ్రోమేట్ పరిమితులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించారు. దీంతో ఆ నమూనాను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం సురక్షితం కానిదిగా ప్రకటించారు.

మరోసారి పరీక్షించినా అదే ఫలితం

తొలుత వచ్చిన పరీక్షా ఫలితాలపై బిస్లెరీ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పీల్ చేసింది. దీంతో సంబంధిత నీటి నమూనాను మరింత విశ్లేషణ కోసం రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లోనూ ఆ నమూనా సురక్షితం కాదని తేలింది. ముఖ్యంగా పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ( పీఏహెచ్ఎస్) ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.రెండు దశల పరీక్షల్లోనూ ప్రతికూల ఫలితాలు రావడంతో ఆహార భద్రతా చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించిన అధికారులు.. బిస్లెరీ సంస్థపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారు.

మరికొన్ని కంపెనీలపైనా చర్యలు

బిస్లెరీతో పాటు మరికొన్ని సంస్థలపైనా ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలకు ఉపక్రమించింది. వసంత్ మసాలా ప్రయివేట్ లిమిటెడ్, టిట్-బిట్ ఫుడ్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, మిమాంస ఇండస్ట్రీస్, ఆశా కన్ఫెక్షనరీ సంస్థలపై కూడా ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది.అంతేకాకుండా ఆహార భద్రతా నిబంధనలు పాటించని కారణంగా ఉర్మి లైఫ్‌సైన్సెస్ ఎల్‌ఎల్‌పీ, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేసింది.

ఆహార ఉత్పత్తులపై తనిఖీలు ముమ్మరం

దేశవ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల భద్రతపై ఎఫ్ఎస్ఎస్ఐ తనిఖీలను మరింత కఠినతరం చేసింది. ఆహార వ్యాపార సంస్థలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయించే ఉత్పత్తుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాలిక్ పానీయాల తయారీ సంస్థలపైనా పర్యవేక్షణ పెంచింది. ఇటీవల రెడ్‌బుల్ ఎనర్జీ డ్రింక్ వర్గీకరణకు సంబంధించి కూడా ఎఫ్ఎస్ఎస్ఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొన్ని పానీయాల్లో అధికంగా కలిపే చక్కెర వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని, వాటి వినియోగంపై ఆందోళనలు వ్యక్తం చేసింది. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా నియంత్రణ సంస్థ ముందుకు సాగుతోంది.అయితే గతంలో బిస్లరీ కోనుగోలుకు సంబంధించి జరిగిన డీల్ విఫలం కావటంతో..తెరవెనుక బీజేపీ నేతలు చక్రం తిప్పిఉంటారనే చర్చ నడుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్