Magazines

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి

14 నిమిషాల క్రితం

attacks
avatar
balaji

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

బహ్రెయిన్‌లోని అల్-రిఫా, అవాలిపై క్షిపణి, డ్రోన్లతో గురి

గగనతలాన్ని ఉల్లంఘిస్తున్నందుకే ప్రతీకార చర్యలు


అల్ రిఫా: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలైన అల్-రిఫా, అవాలిలను లక్ష్యంగా చేసుకుని.. బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్టు ఐఆర్‌జీసీ ప్రకటించింది. అమెరికా దురాక్రమణ, తమ గగనతలాన్ని పదేపదే ఉల్లంఘిస్తున్నందుకు ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్టు ఇరాన్‌ తెలిపింది. ఈ దాడి కారణంగా ఒక పౌర పారిశ్రామిక కేంద్రం దెబ్బతిన్నట్లు బహ్రెయిన్‌ వెల్లడించింది. పలు డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని తెలిపింది. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. హార్ముజ్‌లో రెండు ట్యాంకర్లపై దాడి.. శనివారం హార్ముజ్‌ జలసంధి లోని రెండు ట్యాంకర్లపై దాడి జరిగినట్టు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) ఏజెన్సీ వెల్లడించింది. అనధికార మార్గంలో ప్రయాణించిన మరో నౌక సీమైన్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగినట్టు తెలిపింది.


దౌత్య చర్చలను ముమ్మరం చేయాలి

యుద్ధాన్ని ముగించడానికి కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు హర్మూజ్‌ను తెరవబోమని స్పష్టం చేశారు. మరోవైపు శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ ప్రతినిధుల బృందం శనివారం టెహ్రాన్‌ను సందర్శించి, చర్చలు జరిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్