Magazines

గ్రేటర్‌ ‌వరంగల్‌‌లో ఇందిరమ్మ టవర్స్‌

8 నిమిషాల క్రితం

Indiramma Towers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 2 నిమిషాల చదవడం

960 ఫ్లాట్‌‌ల నిర్మాణానికి రంగం సిద్ధం..
రంగల్‌ గొర్రెకుంటలో నిర్మాణం..
హన్మకొండలో ఖరారు కాని భూమి

ఫ్లాట్‌‌ల కోసం ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తులు

నవతెలంగాణ-వరంగల్‌ ‌ప్రాంతీయ ప్రతినిధి

గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో ఇందిరమ్మ టవర్స్‌ ‌నిర్మాణానికి రంగం సిద్ధమైంది. వరంగల్‌, హన్మకొండ నగరాల్లో ఒక్కో నగరంలో 480 ఫ్లాట్‌‌ల చొప్పున మొత్తం 960 ఫ్లాట్‌‌ల నిర్మాణానికి హౌజింగ్‌ అధికారులు రంగం సిద్ధం చేశారు. జీ+5 టవర్స్‌‌ను నిర్మించి అర్హులకు అందచేయడానికి కార్యచరణ ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే వరంగల్‌ ‌నగరంలోని గొర్రెకుంటలోని కీర్తినగర్‌‌లో హౌజింగ్‌ ‌బోర్డు భూమి 5 ఎకరాల్లో ఈ టవర్‌‌ల నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌నగర పరిధిలోని నగరవాసులు మాత్రమే ఈ పథకం కింద ఎంపిక కావడానికి అర్హులు. వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు మాత్రమే వుండాలి. ఔట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతుండడం, ప్రజల్లో మంచి ఆదరణ లభించడంతో నగరాల్లోనూ పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలన్న తలంపుతో ప్రభుత్వం ఇందిరమ్మ టవర్‌‌ల నిర్మాణానికి పూనుకుంది. నగరాల్లో ప్రభుత్వ భూములు ఎక్కువగా అందుబాటులో వుండవు. ఈ మేరకు ఇందిరమ్మ టవర్‌‌లను జీ+5తో నిర్మించి నగరవాసులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఈ మేరకు రంగం సిద్ధం చేసింది.

వరంగల్‌లో ఆన్‌‌లైన్‌ ‌దరఖాస్తులు

వరంగల్‌ ‌కీర్తినగర్‌‌లో హౌజింగ్‌ ‌బోర్డు స్థలంలో ఇందిరమ్మ టవర్‌‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంతో ఈ ఫ్లాట్‌‌ల కోసం ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తులను తీసుకోవడం ప్రారంభమైంది. వరంగల్‌ ‌నగరంలోని గొర్రెకుంటలో హౌజింగ్‌ బోర్డు భూములుండడంతో ఇందులోనే 5 ఎకరాల భూమిని ఇందిరమ్మ టవర్స్‌ ‌నిర్మాణానికి కేటాయించారు. దీంతో మీ సేవ కేంద్రాలలో ఆన్‌‌లైన్‌‌లో నగరవాసులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆధార్‌‌కార్డుతో ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకొని తొలుత రూ.10 వేలు చెల్లించాలి. గొర్రెకుంటలో దరఖాస్తులను సమగ్రంగా విచారణ పూర్తి చేశాక అర్హులని తేలితే లబ్దిదారుడి వాటా రూ.3.50 లక్షలు చెల్లించాల్సి వుంటుంది. తొలుత చెల్లించిన రూ.10 వేలను ఈ మొత్తం నుంచి మినహాయిస్తారు. దరఖాస్తుదారుడు అర్హుడు కాదని తేలితే రూ.10 వేలను వాపస్‌ ఇవ్వనున్నారు. ఈ పథకంలో లబ్దిదారుడి వాటా రూ.3.50 లక్షలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు చెల్లిస్తుంది. వరంగల్‌ ‌గొర్రెకుంటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్‌‌లను హౌజింగ్‌ ‌బోర్డు అధికారులే నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చాలా ఏళ్లుగా నగరవాసులు ఇళ్ల మంజూరు కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఇందిరమ్మ టవర్స్‌ ‌నిర్మాణానికి రంగం సిద్ధం చేయడంతో పేద, దిగువ మధ్యతరగతి నగరవాసుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతుంది.

హన్మకొండలో ఖరారు కాని భూమి

హన్మకొండ నగరంలో ఇందిరమ్మ టవర్స్‌ ‌నిర్మాణానికి అవసరమైన భూమిని నేటికీ ఖరారు చేయలేదు. రాంపూర్‌ ఇందిరమ్మ కాలనీ వెనుక, లష్కర్‌ ‌సింగారం, కాజీపేట శివారు కడిపికొండలో ఇందిరమ్మ కాలనీ సమీపంలో స్థలాలను పరిశీలించారు. ఈ మూడు ప్రాంతాల్లో భూములను గుర్తించినా నేటికీ ఏ స్థలంలో ఇందిరమ్మ టవర్‌‌లను నిర్మించాలనేది ఖరారు కాలేదు. దీంతో దరఖాస్తు చేసుకోవడం ప్రారంభం కాలేదు. త్వరలోనే హన్మకొండ నగరంలోనూ టవర్స్‌ ‌నిర్మాణాకి స్థలాన్ని ఖరారు చేసి దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. సమగ్ర విచారణతో ఆధార్‌ ‌లింకుతో దరఖాస్తు దారుడికి ఇల్లు, భూమి తదితరాలు ఏమేమున్నయో తెలుసుకున్నాకనే వారి అర్హతపై ఒక నిర్ధారణకు వచ్చి లబ్దిదారుడి వాటాధనం రూ.3.50 లక్షలు చెల్లించడానికి అవకాశం ఇవ్వనున్నారు. ఏదేమైనా ఈ పథకం పట్ల నగరవాసుల్లో ఆసక్తి నెలకొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్