Magazines

రక్తమోడిన రహదారులు

10 నిమిషాల క్రితం

Blood-Stained
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

రాజస్తాన్, గుజరాత్ లో రోడ్డు ప్రమాదాలు
16 మందికి పైగా మృతి

కోటా: బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రహదారులు రక్తమోడాయి. రాజస్తా న్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును టెంపో వాహనం ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది భక్తులు చనిపోయారు. కోటా-ఉదయ్‌ జాతీయ హైవేపై శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయ పడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మహారాష్ట్రకు చెందిన 16 మంది భక్తులు రాజస్తాన్‌లోని ఖాటూశ్యామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం తమ స్వస్థలానికి బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డుపై పార్క్‌ చేసి ఉన్న ట్రక్కును వీరు ప్రయాణిస్తున్న వాహనం బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

గుజరాత్ లో ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురి మృతి..

గుజరాత్‌ లోని కచ్‌ జిల్లాలో ట్రక్కు, కారు ఢీకొన్న ఘటనలో ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో మూడు నెలల పసిపాప సహా ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులను ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద వార్త తెలియగానే ఆర్మీ అధికారులు భుజ్‌ ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్