హీరో నాని తన యునానిమస్ ప్రొడక్షన్స్ ద్వారా మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. 'అలియాస్ రుక్మిణి' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాణంలో ప్రేమ, హాస్యం కలగలిసిన కథతో రూపొందుతున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘రుక్కు రుక్కు రుక్మిణి’ లవ్ సాంగ్ ను విడుదల చేశారు.
విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ పాట వినసొంపైన మెలోడీతో ఆకట్టుకుంటోంది.
కోర్టులో పనిచేసే కృష్ణకు, ప్రతిరోజూ తాను వెళ్లే దారిలో కనిపించే స్కూల్ టీచర్ రుక్మిణిపై ప్రేమ కలుగుతుంది. ఆమె రాకతో తన జీవితానికి కొత్త అర్థం వచ్చిందని భావించే కృష్ణ, తన ప్రేమను మనసుకు హత్తుకునే పదాలతో వ్యక్తపరుస్తాడు. గీత రచయిత పూర్ణాచారి ప్రేమ, ఆరాధన భావాలను అందంగా వ్యక్తపరిచే సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి వోకల్స్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. విజువల్స్ కూడా మెలోడీకి చక్కగా సరిపోయాయి. నితిన్‌ను సాధారణ మధ్యతరగతి యువకుడైన కృష్ణగా, ఆఫియా సయ్యద్‌ను అందమైన రుక్మిణిగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది అని మేకర్స్ తెలిపారు.
ఆసక్తికరమైన ప్రేమకథ..
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)