కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో దర్శకుడు రమేష్ వర్మ ఆర్.వి ఫిల్మ్ హౌస్‌ను ప్రారం భించారు. ఈ బ్యానర్‌పై తొలి సినిమాగా ‘కొక్కొరొకో’ రూపొందుతోంది. ఐదు విభిన్న పాత్రలతో తెరకెక్కు తోన్న ఈ ఆంథాలజీ ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతూ ఓ అందమైన గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో శీను, పార్వతి ప్రేమకథను చూపించారు. శీను కోసం పార్వతి ఎదురుచూస్తుండగా.. ఆమెను సర్ప్రైజ్ చేయడానికి చెరువులో నుంచి పూలు సేకరించి తీసుకొస్తుంటాడు . ఇలా వీరిద్దరి మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలు, అమాయకమైన ప్రేమను ఈ గ్లింప్స్‌లో అందంగా చూపించారు. డా.జయంతి లాల్ సమర్పణలో పెన్ స్టూడియోస్, ఆర్.వి.స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని రేఖా వర్మ, కూరపాటి శిరీష నిర్మిస్తుండగా.. నీలాద్రి ప్రొడక్షన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. రమేష్ వర్మ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను అందించారు.





కామెంట్లు (0)