Magazines

విరావి ఆగమనం

18 నిమిషాల క్రితం

The Arrival of Viravi
avatar
balaji

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పోషిస్తున్న విరావి పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్క రించుకుని విడుదల చేసిన ఈ గ్లింప్స్‌లో అర్జున్ సర్జా శక్తిమంతమైన, ఆసక్తికరమైన లుక్‌లో కనిపించారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్)కు చెందిన భరత్ నారంగ్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయంలోని చీకటి ప్రదేశాలను చూపిస్తూ గ్లింప్స్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అమావాస్య వాతావరణాన్ని ఆవిష్కరిస్తూ విష్ణుమూర్తి నుంచి పరమ శివుడికి మారే దృశ్యాలు, అనంత పద్మనాభస్వామి దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ప్రేక్షకులను 'పొలిమేర' చీకటి ప్రపంచంలోకి తీసుకెళ్తారు. కొమరయ్య పాత్రలో సత్యం రాజేశ్ క్షుద్రపూజలు చేస్తున్న దృశ్యాలు ఉత్కంఠను పెంచుతాయి. ఈ నేపథ్యంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పోషిస్తున్న 'విరావి' పాత్రను పరిచయం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్