ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) కింద పింఛనుదారులకు ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. 2014 తర్వాత ఈ పెన్షన్ మొత్తాన్ని నేటి వరకు పెంచలేదు. భారీగా పెరిగిపోతున్న జీవన వ్యయం కారణంగా ఈ పరిమితిని పెంచాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సుమారు 82 లక్షల మంది ఈపీఎస్ పింఛనుదారులు ఉన్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈ.పీ.ఎఫ్.ఓ) కనీస పెన్షన్ పెంచాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కనీస పెన్షన్ పొందడం కోసం అర్హతగా ఉన్నటువంటి గరిష్ట వేతన పరిమితిని పన్నెండేండ్ల అనంతరం ఇటీవల రూ.15వేల నుంచి రూ. 25వేల వరకు పెంచారు. మధ్యతరగతితో సహా అన్ని వర్గాల ప్రజలపై ఆర్ధిక భారాలు తీవ్రతరమైన ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ, కార్మిక శాఖ, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి కనీస పెన్షన్ను రూ.9వేలకు పెంచాలి. లక్షలాది మంది ఈపీఎస్ పెన్షనర్ల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం వైపు నుండి ఎప్పుడూ తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. నిర్దిష్ట కాల వ్యవధిలో ఏ స్థాయిలో కూడా సమీక్షలు జరగడం లేదు. అందువల్ల ఆకాశన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు, భారీగా పెరిగిన వైద్యం ఖర్చులు, ఇతర జీవితావసరాలను దృష్టిలో పెట్టుకుని ఈపీఎస్ కనీస పెన్షన్ను రూ.9వేలకు పెంచడం సముచితంగా ఉంటుంది.
- వి.వి.కే.సురేష్ ,
9440345850
ఈపీఎస్ పెన్షన్ రూ.9వేలకు పెంచాలి
13 నిమిషాల క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)