మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డీఎన్‌కే’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరో. ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచ యమవుతున్నారు. ఈ సినిమా ఈనెల 13న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఇది మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సబ్జెక్ట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్‌గా ఉంటుంది. ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు.
ఇందులో క్రైమ్ ఎలిమెంట్ ఉన్నప్ప టికీ అది కూడా చాలా ఫన్‌గా ఉంటుంది.
ఈ కథలో ఒక కుర్రాడు ఈజీ మనీకి అలవాటు పడతాడు. గ్యాంబ్లింగ్ చేస్తే డబ్బులు వస్తాయని ఆ మార్గాన్ని ఎంచుకుంటాడు. కానీ అతను తీసుకునే నిర్ణయాల వల్ల అప్పుల్లో కూరుకుపోతాడు.
ఆ అప్పుల నుంచి బయటపడటానికి ఒక దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత అతను ఎలాంటి ఇబ్బం దులు ఎదుర్కొన్నాడు? ఎలాంటి కష్టాల్లో చిక్కుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ.
ఆలీతో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఇప్పటి వరకు ఆయన ఎక్కువగా ఫాదర్ రోల్స్ చేయలేదు. ఈ సినిమాలో ఆయనకు సంబంధించిన సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి.
సినిమా అంతా చాలా మంచి ఎం టర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ట్విస్టులు కూడా ఉంటాయి. సింజిత్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాట లను థియేటర్లలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే కథనం కూడా థ్రిల్ చేస్తుంది.
హాయిగా నవ్వుకుంటారు
18 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం



కామెంట్‌లు (0)