Magazines

‘భోగి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

1 గంట క్రితం

‘Bhogi’ release date fixed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో శర్వా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1960ల ప్రారంభంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దు నేపథ్యంలో సాగుతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కందుల సులోచన రాణి పాత్రలో ఆమె ఫస్ట్ లుక్, పాటల్లో ఆమె ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా అనుపమ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియో నుంచి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ తో పాటు డింపుల్ హయాతి మరో కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 12న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్