Magazines

‘కొబ్బరిమట్ట’ రీ-రిలీజ్‌కి రెడీ

38 నిమిషాల క్రితం

Kobbarimatta
avatar
balaji

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

సాయి రాజేష్ స్క్రిప్ట్ అందించి, నిర్మించిన హిలేరియస్ మూవీ ‘కొబ్బరిమట్ట’ ప్రేక్షకుల్ని బాగా నవ్వించింది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 14న రీ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని వల్లంసెట్ల కృష్ణారావు సమర్పణలో అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి రాజేష్ నిర్మించారు. ఇషికా సింగ్, గీతాంజలి, షకీలా కీలక పాత్రల్లో నటించారు. 2019 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆద్యంతం నవ్వించి మంచి విజయాన్ని అందు కుంది. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ, ‘నా కెరీర్ లో ఈ సినిమా ఎంతో స్పెషల్ . ఈ సినిమా టైమ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఫైనాన్స్ పరంగా కష్టాలు చూశాం. ఆ నాలుగేళ్ల శ్రమ ఆగస్టు 10న సినిమా రిలీజ్ రోజున మ్యాట్నీ, ఫస్ట్ షోలతో ఫలితాన్నిచ్చింది. ఈ సినిమా సాధించిన విజయం మాకు ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్ని అందించింది.

సినిమాకున్న పవర్ ఏంటో ఆ రోజు తెలిసింది. మనం ఇక్కడ మరిన్ని మూవీస్ చేసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ మాలో కలిగింది. నాకు బేబి, చెన్నై లవ్ స్టోరీస్ విజయాలు సంతోషా న్నిచ్చినా ఈ సినిమా అందించిన విజయం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. సంపూర్ణేష్ ను హృదయ కాలేయం సినిమాతో పరిచయం చేశాక, మా కాంబోలో రెండో చిత్రంగా ఈ సినిమా వచ్చింది. సంపూతో వర్క్ చేస్తున్నప్పుడు రైటింగ్ లో కొత్త కొత్త ప్రయోగాలు చేశాం. ఇందులోని డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో సాయి రాజేష్ నాతో మూడు క్యారెక్టర్స్ చేయించారు. అలాగే నాతో 3 నిమిషాల 20 సెకన్ల భారీ డైలాగ్ చెప్పించాడు. సినిమా రిలీజైన ఇన్నేళ్ల తర్వాత కూడా చాలా మంది ఫోన్స్ చేసి మీ కొబ్బరిమట్ట సినిమా మాకు చాలా ఇష్టమని చెబుతుంటారు. రాజేశ్‌ రాసిన స్క్రిప్ట్ వల్లే మా మూవీ అందరికీ గుర్తుండిపోయింది’ అని హీరో సంపూర్ణేష్ బాబు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్