జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ముఖ్య తారాగణంగా రూపొందిన సై ఫై థ్రిల్లర్ ‘కిల్లర్’. ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిం చారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్ప కుడు. ఈ నెల 30న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మంగళవారం డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో పూర్వాజ్ మీడియాతో చిత్ర విశేషాలను షేర్ చేసుకున్నారు.
సెన్సార్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా చూశాక సెన్సార్ వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాత, నటుడిగా మూడు బాధ్యతలు తీసుకున్నాను.
మా సినిమా సెకండాఫ్ లో ట్విస్ట్ చెప్పినవారికి కోటి రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించాం. ఇది ప్రమోషనల్ స్టంట్ కాదు. దీని మీద ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం.
హైకోర్టు లాయర్స్ కూడా అందులో పాల్గొంటారు. ఈ నెల 29న రాత్రి 10 గంటలకు మా మూవీ ప్రీమి యర్స్ పడతాయి. 11 గంటలకు ఆ ట్విస్ట్ ఏంటనేది వాట్సాప్ చేయాలి. ఎవరు త్వరగా ఆన్సర్ పంపిస్తే వారి పేరు మా మూవీ సక్సెస్ మీట్ లో ఎల్ ఈడీ స్క్రీన్ మీద డిస్ ప్లే చేస్తాం.
ఇందులో ప్రీ క్లైమాక్స్ నుంచి అన్ని ట్విస్ట్ లు రివీల్ అవుతూ సర్ ప్రైజ్ చేస్తాయి. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అనే పాయింట్ ను మాస్ ఎలిమెంట్స్ తో కలిపిన కథతో మీకు కన్విన్సింగ్ గా చూపించే చిత్రమిది. కథలోని అసలైన పాయింట్ కు షాక్ అవుతారు. ఇలా కూడా సినిమాను తీయొచ్చా అనుకుంటారు.
జ్యోతి పూర్వజ్ని ఇందులో పూర్తిగా కొత్తగా చూస్తారు. ఆమె భిన్న పాత్రలతో మిమ్మల్ని ఆకట్టు కుంటారు.
పబ్లిసిటీ స్టంట్ కాదు
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)