హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ని చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. ఈ నెల 9 నుంచి తెలుగు ఓటీటీ వేదిక ఈటీవి విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ బ్యాచ్‌లర్ పార్టీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో వైవా హర్ష మాట్లా డుతూ,‘ఈటీవీ అంటే మనకి ఇంటితో సమానం. చిన్నప్పటి నుంచి మనం ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తూనే పెరిగాము. నాలుగు నెలల్లో ఒక ప్రాజెక్ట్‌ను ఫినిష్ చేసి రిలీజ్ చేయడం అనేది ఒక కేస్ స్టడీ. షూటింగ్ అంతా చాలా కంఫర్టబుల్‌గా జరిగింది. ఇందులో ఎంటర్‌టైన్ మెంట్‌తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంది. చాలా గ్రాండ్‌గా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ రెండు ఎపిసోడ్లు ఫ్రీగా ఇస్తున్నాం. ఆ తర్వాత మీరు కచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేసుకుని చూస్తారని నమ్మకం ఉంది. సందీప్‌కి థాంక్యూ. తనే ఈ టైటిల్‌ను సజెస్ట్ చేశాడు. త్వరలోనే సీజన్ 2 కూడా చేస్తాం’ అని తెలిపారు. ‘ఈ సిరీస్‌లో ఈ క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు. హర్ష చాలా అద్భుతంగా చేశాడు. ఇది మంచి కామెడీ సిరీస్. దర్శకుడు బాబుకి ఈ సిరీస్ తర్వాత మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను’ అని ఈటీవీ సాయి కృష్ణ చెప్పారు.







కామెంట్‌లు (0)