నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమే శ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాం బాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం’.
యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. బద్రప్ప గాజుల దర్శకుడు. దసరా పండుగ సందర్భంగా నేడు (శుక్రవారం) ఈ సినిమా రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మీడియాతో ముచ్చటించారు.
ఇది ఫన్, ఎమోషన్ ఉన్న స్టోరీ. నరేష్, అఖిల్, తరుణ్ భాస్కర్..ఇలా వీళ్లంతా కాస్టింగ్ లో జాయిన్ అయ్యాక మరింత క్రేజీ ప్రాజెక్ట్ అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి లాంటి క్రేజీ ప్రొడ్యూసర్ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా మన ముందుకు వచ్చేది కాదు.
ఈ సినిమాలో నాకు పెళ్లి అవుతుందా కాదా అనేది తెరపై చూడాలి. పెళ్లి అనేది ఇద్దరు కలిసి సంతోషంగా జీవించ డానికి చేసుకునేది. కానీ అమ్మాయిని ఇంట్లో పని మనిషిని చేసేందుకు కాదు అనేది నా క్యారెక్టర్ కీర్తి ఉద్దేశం.
ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ అన్ని స్ట్రగుల్ పడుతుంటాయి. మా కష్టాలు మీకు కామెడీగా అనిపిస్తాయి. మా పాత్రల ద్వారా, ఆ సందర్భాల ద్వారా ఆర్గానిక్ గా కామెడీ జెనరేట్ అవుతుం టుంది. స్క్రిప్ట్ చెప్పేందుకు వచ్చినప్పుడే డైరెక్టర్ గా బద్రప్పలోని సిన్సియారిటీ, కన్విక్షన్ చూశాను. ఆయన ఈ కథ చెబుతుంటే కొన్ని సార్లు నవ్వొచ్చింది, కొన్ని సీన్స్ కు ఎమోషనల్ అయ్యాను. బాలరాజు పాత్రతో సహా ఆయన కంప్లీట్ స్క్రిప్ట్ చెప్పారు.
తరుణ్ భాస్కర్ చేసిన బాలరాజు క్యారెక్టర్ మనలో ఒకడు, మనం రోజు చూసే లైఫ్ లో నుంచి వచ్చిన పాత్ర అది. మా పేరెంట్స్ క్రేజీ కల్యాణం సినిమా చూసి చాలా బాగుందని ప్రశం సించారు. ప్రేక్షకులకు మా సినిమా వాళ్ల ఇంటి కథలా అనిపిస్తుంది. పండుగ సీజన్లో ఒక క్రేజీ ఫిలిం చూసిన ఫీలింగ్ మీలో కలుగుతుంది.
నేను చేసే ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటాను.
మీ ఇంటి కథలా అనిపించే సినిమా
58 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 15, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్లు (0)