Magazines

‘డ్యూ డేట్‌’లో పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్ర

1 గంట క్రితం

awyer role
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

లోమేష్‌ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ‌ హీరోయిన్‌గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'డ్యూ డేట్‌.' వరిష్‌ స్టూడియోస్‌ పతాకంపై పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్‌.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఏకధాటిగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో నటుడు సునీల్‌ జాయిన్‌ అయ్యాడు. ఓ పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఆయన కెరీర్‌ల్‌ ఇదొక డిఫరెంట్‌ పాత్రగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ చిత్రంలో మరో కీలకమైన లాయర్ పాత్రలో నటి అక్షర గౌడ నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ,‘ప్రజెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్‌ చుట్టు పూర్తి వాణిజ్య అంశాలతో అల్లుకున్న కథ ఇది’ అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్