Magazines

థ్రిల్‌ చేసే షో..

1 గంట క్రితం

thrilling show
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

భారతదేశంలో ప్రత్యేక ఒరిజి నల్స్‌కు పేరుపొందిన ప్రముఖ స్ట్రీమింగ్ సర్విస్ ప్రైమ్ వీడియో, ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేసింది. నమ్మకం, మోసం, ద్రోహం చుట్టూ సాగే ఈ ఉత్కంఠభరితమైన గేమ్‌కు ట్రైలర్ ఆసక్తికరమైన పరిచయాన్ని అందించింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రియాలిటీ ఫార్మాట్‌ను తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన స్థానిక హంగులతో తీసుకొస్తున్నారు. విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలు ఈ గేమ్‌లో పాల్గొంటున్నారు. చిన్మయీ శ్రీపాద, హర్ష వర్ధన్, ప్రగతి మహా వాది, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర సింహ, విద్యూ రామన్, విష్ణు ఓయ్, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకర్ అగస్తి, ఆశికా పదుకొనే, వర్షా డి'సౌజా, ప్రణవ్ అలియాస్ అభినవకవి, ఎస్‌ఎస్ వర్ధన్, రహత్ అచంట, గౌరవ్ సునీల్, సాయి రోనక్, పుప్పాల ధనుంజయ, ఫాల్గుణి బంగేరా ఈ షోలో పాల్గొంటున్నారు. హీరో తేజ సజ్జ రియాలిటీ షో హోస్ట్‌గా తొలిసారి పరిచయం అవు తున్నారు. 10 ఎపిసోడ్లుగా తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రైమ్ వీడియోలో ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు స్ట్రీమింగ్‌ కానుంది. తేజ సజ్జ మాట్లాడుతూ, ‘ది ట్రెయి టర్స్ తో ఎక్సైట్మెంట్, థ్రిల్ ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా పెద్ద హిట్ షో. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇది ఒక బిగ్ మూమెంట్ అని నేను భావిస్తున్నాను’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్