Magazines

మైసూరులో ‘దాదా’ షూటింగ్

1 గంట క్రితం

Dada
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. అనంతరం విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో బాలకృష్ణ రగ్గడ్, స్టైలిష్, పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించ నున్నారు. ఆయన లుక్, పాత్ర మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా షూటింగ్ నేటి (బుధ వారం) నుంచి మైసూరులో పునః ప్రారంభమైంది. ఇటీవల గాయ పడిన బాలకృష్ణ కోలుకుని తిరిగి షూటింగ్ సెట్స్‌లోకి అడుగు పెట్టారు. కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌లో ఆయన చిత్రబృందంతో కలిసి పాల్గొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రధానంగా టాకీ పార్ట్‌ను చిత్రీకరి స్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ తర్వాత మరోసారి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు అని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమా డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంగీతం: ఎస్. తమన్‌, డీవోపీ: అరవింద్ ఎస్ కశ్యప్, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్