Magazines

భిన్న కాన్సెప్ట్‌..

1 గంట క్రితం

Unique Concept
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న తొలి చిత్రం ప్రొడక్షన్ నెం.1 దసరా పర్వదినాన్ని పురస్కరించు కుని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్‌ దామోదర్‌ నేరేళ్ల నిర్మిస్తున్నారు. శశాంక్‌ దువ్వూరు దర్శకుడిగా పరిచయ మవుతున్నారు. రవి శివతేజ, భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, నేహా పఠాన్‌ కథా నాయికగా కనిపించనున్నారు. నిర్మాత డాక్టర్‌ దామోదర్‌ నేరేళ్ల మాట్లాడుతూ, ‘సినిమా అంటే ఎంతో ఇష్టం. నా సినిమా కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. దర్శకుడు శశాంక్‌ చెప్పిన కథ ఎంతగానో నచ్చింది. ప్రేమ, స్నేహం, కుటుంబ విలువలతో పాటు మంచి సందేశాన్ని అందించే అంశాలు ఇందులో ఉన్నాయి’ అని తెలిపారు. ‘ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే కథలో వినోదంతో పాటు విభిన్నమైన అంశాలను ఆసక్తికరంగా ఆవిష్కరించబోతున్నాం’ అని దర్శకుడు శశాంక్‌ దువ్వూరు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్