Magazines

అంతకుమించి..!!

57 నిమిషాల క్రితం

‘Jo Jo’
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

కృష్ణ క‌మ‌ల్ , మ‌హి జంటగా రూపొందుతున్న రూర‌ల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా స‌మ‌ర్ప‌ణ‌లో కిర‌ణ్ జ‌య్ కుమార్ ద‌ర్శ‌కుడిగా రూపొందుతోంది. విజ‌యం బ్యాన‌ర్‌పై విజ‌య్ కృష్ణ లింగ‌మ‌నేని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన కాష‌న్ 1కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఈ సినిమా నుంచి కాష‌న్ 2 వీడియోని విడుద‌ల చేశారు. జొన్న‌గిరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. మ‌నో భావాల బ్యాచ్ దూరంగా ఉండండంటూ విడుద‌లైన కాష‌న్‌1కు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో కాషన్‌ 2 ఉంది. రా ర‌స్టిక్ రొమాంటిక్ మూవీగా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాకి మ్యూజిక్‌: మ‌హేష్ శంక‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ: రోహిత్ కుమార్‌, ఎడిట‌ర్‌: మాధ‌వ్ కుమార్ గుళ్ళ‌ప‌ల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: నాగి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్