డార్లింగ్ అని అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ముద్దుగా పిలుచుకునే ఏకైక కథానాయకుడు ప్రభాస్.తనదైన నటన,హావభావాలు,డైలాగ్ డెలివరీతో మెస్మరైజ్ చేయటంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయన సినిమాల కోసం అటు ఫ్యాన్స్, ప్రేక్షకులే కాదు ఇండ్రస్టీ వర్గాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి. శుక్రవారం ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆయనతో సినిమాలు చేస్తున్న మేకర్స్ సరికొత్త అప్‌డేట్స్‌తో అందరి ఆసక్తిని రెట్టింపు చేశారు.
‘కల్కి’ సీక్వెల్
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ అద్భుత మైన విజయాన్ని సాధించింది. ఫ్యూచర్, పురాణాల కలయికతో రూపొందిన ఈ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత భారీ స్థాయికి తీసుకెళ్లేలా సీక్వెల్ ‘కల్కి 2’ను తెరకెక్కిస్తు న్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ప్రత్యేకమైన బీటీఎస్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సీక్వెల్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘సలార్ 2’
డైనోమైట్ ద్వయం ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’తో ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ని అందించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ ఫ్రాంచైజీపై అంచనాలను మరింత పెంచుతూ ‘సలార్ 2’ సీక్వెల్‌ను ప్రకటించారు. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా పనులు పూర్తయిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ సాధించిన అద్భుతమైన విజయంతో పాటు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్.. సీక్వెల్ పై అంచనాలను మరింత పెంచాయి. వీటితోపాటు ఆయన మరో సినిమాలతో అందరినీ అలరించేందుకు రెడీ అవుతున్నారు.
‘స్పిరిట్’, ‘ఫౌజీ’..
సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న ‘స్పిరిట్’, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ వంటి భారీ పాన్ ఇండియా సినిమాల్లోనూ ప్రభాస్ నటిస్తున్నారు. ‘ఫౌజీ’ సమ్మర్ స్పెషల్‌గా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతుండగా, ‘స్పిరిట్’ సినిమా వచ్చే ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.






కామెంట్‌లు (0)