విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కల్ట్’. భారతీయ చలన చిత్రాల్లో నే మొట్ట మొదటి స్లాశర్ గా తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఇటు పరిశ్రమ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’ లాంటి పాన్ ఇండియా భారీ చిత్రాలకు మ్యూజిక్ అందించిన సేన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో సంచలనం కానుందని, ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకుందని చిత్ర బృందం తెలిపింది. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్ లో వందలాది మోడల్స్ తో 40 -50 రోజుల పాటు తెరకెక్కిన కీలక సన్నివేశాలు భారతీయ చలన చిత్రాలకు ధీటుగా రూపొందించబడ్డాయని, ఇప్పుడున్న జెన్‌జీ యూత్ లో ప్రత్యేక మైన కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సెన్సేషన్ తరుణ్ భాస్కర్ అందించిన మాటలు మరో హైలైట్ అవుతాయని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు. తారక్ సినిమా బ్యానర్ పై సందీప్ కాకరాల ఖర్చుకు వెనకాడకుండా అత్యంత భారీగా టెక్నాలజీ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, పుష్ప ఫేమ్ తారక్ పొన్నప్ప, ప్రజ్ఞ, లాంటి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.






కామెంట్లు (0)