Magazines

హాయిగా నవ్వుకుంటున్నారు

52 నిమిషాల క్రితం

Laughing happily.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం


శ్రీ విష్ణు నటించిన తాజా సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పించగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ‘నవ్వుల నవరాత్రులు’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, ‘మా సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. వర్డ్ ఆఫ్ మౌత్ చాలా పాజిటివ్‌గా స్ప్రెడ్ అవుతోంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ ప్రేక్షకులు చాలా మంచి స్పందన ఇస్తున్నారు. దసరా పండుగకు ఫ్యామిలీస్ అందరూ కలిసి ఈ సినిమాని హ్యాపీగా చూడొచ్చు. రెండు గంటల పాటు కడుపునిండా హాయిగా నవ్వుకోవాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. ఈ సినిమా చూసి ఒక పెద్ద హీరో కాల్ చేసి సినిమాని మెచ్చుకున్నారు. నెక్స్ట్ ఈవెంట్కి ఆయన వస్తారు’ అని తెలిపారు.

‘సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ల లో నవ్వుల వర్షం కురిపిస్తున్నారు. సినిమాకి అన్ని చోట్ల నుంచి కూడా చాలా మంచి మౌత్ టాక్ వస్తోంది. ఒక సీరియస్ టాపిక్ అయిన ప్పటికీ, దీన్ని ఫన్ ఎంటర్‌టైనర్‌లా చూపించడం ప్రేక్షకులకు నచ్చడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా కోసం ఒక జాతర ఎపిసోడ్ షూట్ చేశాం. కాకపోతే అది కథా ప్రవాహానికి అడ్డు వస్తుందని, వెన్నెల కిషోర్ గారితో ఒక స్పెషల్ ట్రాక్ చేయించాం. దానికి కూడా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి నిర్మాతగా, రైటర్‌గా ఉన్నాను. ఈ దసరా పండుగకు అందరూ ఫ్యామిలీతో కలిసి థియేటర్‌లో అద్భుతంగా ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అని సమర్పకుడు కోన వెంకట్ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్