హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలిసి చేస్తున్న యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా‘సీన్’. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి జయశ్రీ దామోదరన్ సహ నిర్మాత. ఇటీవల మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసి సినిమాలోని క్విర్కీ, ఎంటర్‌టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఫస్ట్ సింగిల్ ‘అమ్మో ఇది ఎవర్రా’ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ సింగిల్ ‘ఏరో ప్లేన్’ అదిరిపోయే ఎనర్జీతో ఆకట్టుకుం టోంది.
ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్ రిలీజ్ కానుంది.
‘అగ్ర కథానాయకుడు సూర్యకి తెలుగునాట కూడా మంచి అభిమానగణం ఉంది. ఆయన సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆయన నటించిన ‘సీన్’ సినిమాని మా బ్యానర్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయటం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఆయన అభిమానులనే కాదు ప్రేక్షకులను సైతం సర్‌ప్రైజ్ చేస్తుంది’ అని ఎస్వీఆర్ సినిమా అధినేత అన్నారు. ఈ చిత్రానికి వినీత్ అగస్టిన్ సినిమాటోగ్రఫీ, సుశిన్ శ్యామ్ సంగీతం సమకూరుస్తున్నారు. అజ్మల్ సాబు ఎడిటింగ్, అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది.






కామెంట్‌లు (0)