నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం’.
యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు.
దర్శకుడు బద్రప్ప గాజుల రూపొం దించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజ యాన్ని సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన సక్సెస్మీట్లో డైరెక్టర్ బద్రప్ప గాజుల మాట్లాడుతూ, ‘మా సినిమాను ప్రతి ఆడ పిల్ల ఓన్ చేసుకుంటోంది. నా జీవితంలో నేను చూసిన మనుషులను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాను. మా సినిమా ఇంత గ్రాండ్ గా మీ ముందుకు వచ్చి సక్సెస్ అందు కుందంటే అందుకు మా ప్రొడ్యూ సర్ జగన్ మోహన్ కారణం’ అని తెలిపారు.
‘మా సినిమాకు సపోర్ట్ చేసి విజ యాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.
పెద్ద సినిమాల మధ్య మీ సినిమా వేశారు కదా అంటున్నారు. కానీ పండక్కి అన్ని సినిమాలను ఆదరిస్తారని నమ్మాం. ఈ రోజు నుంచి మా సినిమా థియేటర్స్ లో మరింత పికప్ కాబోతోంది’ అని నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, ‘మేము థియేటర్స్ విజిట్స్ కు వెళ్లినప్పుడు ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీలవుతున్నాం. మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ప్రశంసిస్తారు అనేందుకు ఆ సినిమా ఎగ్జాంపుల్’ అని తెలిపారు.
‘దసరా పండక్కి రక్తపాతాల కథల సినిమాలతో పాటు రక్త సంబంధాల కథల సినిమాలు కూడా చూస్తామని తెలుగు ఆడియెన్స్ ప్రూవ్ చేశారు. మా డిస్ట్రిబ్యూటర్స్ నమ్మకం, ధైర్యం కూడా నిజమైంది. ఈసినిమాకి అవార్డులు కూడా వస్తాయి’ అని నరేష్ విజయ కృష్ణ అన్నారు.
ప్రేక్షకుల రెస్పాన్స్ సూపర్
49 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)