Magazines

‘స్పిరిట్‌’.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

47 నిమిషాల క్రితం

‘Spirit’.. release date fixed
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

అగ్ర కథానాయకుడు ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ డ్రామా 2027 అక్టోబర్ 29న దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మేకర్స్ తాజాగా విడుదల చేసిన కొత్త రిలీజ్ పోస్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఇంటెన్స్, స్టైలిష్, మిస్టీరియస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. భారీ స్థాయి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే రెండు పవర్ హౌస్ లు ‘స్పిరిట్’తో ఒక్కటవుతున్నారు. తన మొదటి మూడు సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద బలమైన ట్రాక్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి వంగా..

ప్రభాస్‌ను మరో ఇంటెన్స్, పవర్ ఫుల్ కథలో ఆవిష్కరించబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం దర్శకుడు ఎలాంటి పాత్రను, ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించారో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రిప్తి డిమ్రి కథానాయికగా, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ స్టార్‌డమ్, సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకమైన స్టొరీ టెల్లింగ్, దీపావళి పండుగ విడుదల.. ఈ మూడు అంశాలతో ఈ సినిమా భారీ థియేట్రికల్ అట్రాక్షన్‌గా రూపుదిద్దుకుంటోంది అని మేకర్స్‌ అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్