Magazines

మన ఇంటి కథ..

1 గంట క్రితం

Slip of paper
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నిర్మాత బన్నీ వాస్, డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా ‘ఇడుపు కాయితం’. ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తుండగా, దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న థియేట్రికల్ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సినిమా నుంచి 'గడప..' సాంగ్ లాంచ్‌ ఈవెంట్ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. ‘మా ప్రొడక్షన్ హౌస్ సహకారంతో 31 రోజుల ఔట్ డోర్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాం. మా నిర్మాతలు ఏది కావాలన్నా అందించారు’ అని అన్నారు. ‘ఈ సాంగ్ మీ అందరికీ కనెక్ట్ అయ్యిందని నమ్ము తున్నాను. ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ కాగానే మా నాన్న ఫోన్ చేసి బాగా నటించావు అని కన్నీళ్లు పెట్టుకున్నారు’ అని హీరోయిన్ నాగదుర్గ చెప్పారు.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, ‘మా అమ్మ తన ఇంటి గడప దాటి మా ఇంటికి వచ్చింది, అలాగే నా సోదరి, నా భార్య..ఇలా మన ఇంటిలో గడప గురించి చాలా జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి గడపను సెలబ్రేట్ చేసే పాట ఉంది’ అని తెలిపారు. ‘ఈ రోజు నాకు ప్రత్యేకమైన రోజు. శ్రీలత సాంగ్ ను మీతో పాటు తెరపై చూశాను. ఆ పాటలో నా కూతురు కూడా ఉంది. తనను స్క్రీన్ మీద చూడటం ఇదే తొలిసారి. దర్శకుడు వంశీరెడ్డి ఈ కథ చెబుతున్నప్పుడు తెలంగాణ నేపథ్యం అనేది గుర్తుకురాలేదు. నాకు నా చిన్నప్పుడు చూసిన ఊరు, ఇంటి వాతావరణం కళ్లకు కట్టినట్లు కనిపించింది. కథ విన్న వింటనే ఇది సినిమా కథలా లేదు మన ఇంట్లో జరిగే కథలా ఉంది అని చెప్పాను’ అని ప్రొడ్యూసర్ బన్నీవాస్ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్