కథానాయిక రుక్మిణి వసంత్, దర్శకుడు శ్రీ కార్తిక్ కలయికలో ఓ కొత్త సినిమా తెరకెక్కనున్ంది. దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శ్రీ కార్తిక్ తెరకెక్కించనున్న నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవ్ రామనాథ్, వినాయక్ వైద్యనాథన్ కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. ఇందులో రుక్మిణి వసంత్‌ను ‘తారా’గా పరిచయం చేశారు. ఈ చిత్రాన్ని సిరుని సినీ కార్పొరేషన్, మ్యాడ్‌బాయ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాయికృష్ణ గడ్వాల్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘తారా’ గ్లింప్స్‌తో సినిమా కథా ప్రపంచం, వినోద భరితమైన టోన్‌పై ఓ ఆసక్తికరమైన పరిచయాన్ని అందించిన మేకర్స్, త్వరలోనే టైటిల్‌ను ప్రకటించ నున్నారు.






కామెంట్‌లు (0)