Magazines

అరుదైన సక్సెస్‌ ఇది

1 గంట క్రితం

This is a rare success.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మయూఖ’. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మించారు.

శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఇటీవలే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ట్రెండ్ సెట్టింగ్ థ్రిల్లర్ గా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ని సోమవారం హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డి.గిరీష్ రెడ్డి మాట్లాడుతూ,‘ మా సినిమాకు ఉన్న బడ్జెట్ లో ఇంత క్వాలిటీగా సినిమా చేసి, గ్రాండ్ గా రిలీజ్ చేసుకున్నాం అంటే అందుకు మా డైరెక్టర్ విజన్ కారణం. ఆయనకు పెద్ద బడ్జెట్ ఇచ్చి సినిమా చేయమంటే మిరాకిల్స్ చేస్తారు. మా సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు. యాక్టర్ రఘు వాసిరెడ్డి మాట్లాడుతూ,‘ మాసినిమా సక్సెస్ షీల్డ్ అందుకోవడం నా కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవ్ మెంట్ గా భావిస్తున్నా’ అని తెలిపారు.

‘ఈ రోజున సినిమాలు ఒక వారం రోజులు ఆదరణ పొందితేనే గొప్ప విషయం. అలాంటిది మా సినిమాకు పాతిక రోజుల రన్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాం. చిన్న సినిమాల విషయంలో బాక్సాఫీస్ వద్ద ఇది అరుదుగా దక్కే విజయం’ అని యాక్టర్ అభిలాష్ అడ్డ చెప్పారు.

ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ, ‘ఒక సినిమా రిలీజై నెక్ట్స్ ఫ్రైడే చూడటం అనేది అరుదు. అలాంటిది 25 రోజులు థియేటర్స్ లో సినిమా రన్ కావడం అంటే ఈజీ కాదు. అలాంటి ఘనత సాధించిన మా చిత్ర టీమ్ ను అభినందిస్తున్నా’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్