Magazines

ఇది ప్రత్యేకమైన ‘ఆదర్శ కుటుంబం’..

1 గంట క్రితం

ideal family’.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

కథానాయకుడు వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. దీపావళి కానుకగా ఈనెల 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్‌ వైభవంగా నిర్వహించారు. వెంకటేష్ మాట్లాడుతూ,‘20 ఏళ్ల తర్వాత నాది, త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుంది. త్రివిక్రమ్ అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చారు. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కామెడీ మాత్రమే కాకుండా థ్రిల్, సస్పెన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో కథ చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. నేను ఫ్యామిలీ సినిమాలు చాలా చేశాను. కానీ, ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. ఏం జరిగినా నేను నా ఫ్యామిలీని కాపాడుకోవాలి. ఈ ఫ్యామిలీని నేను కాపాడుకుంటాను, వాళ్ళతోనే ఉంటాను..


అదే ఆదర్శ కుటుంబం. మన ఇండియన్ క్రికెటర్లు ఎలా సిక్సర్లు కొడుతున్నారో.. ఈ సినిమాతో స్టేడియం బయట మేము అలా సిక్సర్లు కొడతాం. సినిమా చాలా బాగా వచ్చింది’ అని తెలిపారు. ‘కుటుంబం మనకి ఇవ్వబడుతుంది. మనం సెలెక్ట్ చేసుకోము. ఏ అమ్మానాన్నకి పుట్టాలి, ఏ ఊళ్ళో పుట్టాలి, ఏ ఇంట్లో పుట్టాలి అది మన చేతుల్లో ఉండదు. కావున కుటుంబం మనకి ఇవ్వబడుతుంది. బంధాలన్నీ మనకి ఇవ్వబడతాయి. అలా ఒక ఇవ్వబడిన కుటుంబం, ఇవ్వబడిన బంధాలు, వాటిని కాపాడు కోవడానికి చిట్టిబాబు, స్వర్ణ, సంపూర్ణ, సర్వ అనే నలుగురు మనుషులు ఎంత కష్టపడ్డారు? ఎంత దూరం వెళ్ళారు? ఒక సామాన్యుడు తెగిస్తే ఎంతదూరం ప్రయాణం చేయగలడు? అది ఈ సినిమా తాలూకు కథ. కుటుంబ కథలకు కేరాఫ్ అడ్రెస్ వెంకటేష్. ఫ్యామిలీ సినిమాలతో సూపర్ స్టార్ అవ్వొచ్చని నిరూపించిన హీరో ఆయన’ అని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్