Magazines

ఇది రొటీన్‌ సినిమా కాదు

2 రోజుల క్రితం

film
avatar
balaji

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి 'డార్క్ చాక్లెట్‌' చిత్రాన్ని అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ, ‘ఒక మంచి సినిమాను తీశాం. ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా ఇది. ఇప్పటివరకు ఈ సినిమా చూసినవాళ్లు మర్చి పోలేకపోతున్నారు. మళ్లీ మళ్లీ చూడాలనుకుంటు న్నారు. మేము కచ్చితంగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం. అది మీరు ఈనెల 13న చూడబోతున్నారు.

ఇది రొటీన్ సినిమా కాదు. సినిమా అనే ఫార్మాట్‌కే ఛాలెంజ్ చేసేంత కొత్తగా శశాంక్ ఈ కథను రాశారు. ఎవరూ ఈ సినిమాను థియేటర్లలో మిస్ అవ్వకూడదని కోరు కుంటున్నాను’ అని తెలిపారు. ‘ఇది చాలా కొత్త తరహా సినిమా. మా కంటెంట్‌పై మాకు చాలా నమ్మకం ఉంది’ అని బిందు మాధవి చెప్పారు. డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ‘ఇలాంటి సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలని సినిమా చూసిన చాలామంది అంటున్నారు. విశ్వదేవ్ లేకపోతే ఈ జర్నీ సాధ్యపడేది కాదు. బిందు తన పాత్రను అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. వివేక్ సాగర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్