Magazines

‌పాలమూరును వెయ్యేండ్లు 
వెనక్కి తీసుకెళ్లిన కాంగ్రెస్‌

19 నిమిషాల క్రితం

Congress took Palamuru back a thousand years
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

మాజీమంత్రి నిరంజన్‌‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

పాలమూరును వెయ్యేండ్లకు సరిపడా విధ్వంసం చేసి వెనక్కి తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక అడ్డంకులు అధిగమించి కేసీఆర్ రూ.35 వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. పంటలు వేయొద్దని చెప్పిన మొదటి సీఎంగా రేవంత్ రెడ్డి నిలబడిపోతారని అన్నారు. ఆరుతడి పంటలు వేయమంటున్నారనీ, మరి వాళ్ల నీళ్లు, కరెంటు సంగతి ఏంటనే విషయం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైన వేదికల మీద పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం, అక్కడ రాజకీయాలు మాట్లాడడం, అందులో ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని ధూషించడం రేవంత్‌‌రెడ్డికే చెల్లిందన్నారు. ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌లో మిగిలిన 13 నియోజకవర్గాలకు చేసింది ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులను ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోయాలని కోరారు.

మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ

పాలమూరు జిల్లాకు ఏడాదికి రూ.20 వేల కోట్లు ఇస్తామన్నారనీ, మూడేండ్లు అయ్యిందనీ, రూ.60 వేల కోట్లు కాదు రూ.ఆరు కోట్లు అయినా వచ్చాయా?అని ప్రశ్నించారు. పాలమూరుకు దగా చేసింది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. పాలమూరు జిల్లా కళకళలాడాలన్నా, రైతు రాజు కావాలన్నా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేశ్‌ రెడ్డి, శాట్స్ ‌మాజీ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్