Magazines

ప్రతాపవర్మ

2 గంటల క్రితం

ఉజ్జయిని రాజ్యాన్ని వీరసేనుడు పరిపాలిస్తూ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 2 నిమిషాల చదవడం

ఉజ్జయిని రాజ్యాన్ని వీరసేనుడు పరిపాలిస్తూ ఉన్నాడు. మహా మంత్రి కేతుడు రాజును తప్పుదోవ పట్టిస్తు రాజ్యం హస్త గతం చేసుకోవాలి అనుకునే వాడు. కాని నమ్మకమైన సేనాని ప్రతాప వర్మతో అది సాధ్యపడలేదు. మహా మంత్రి బుద్ధి వీరసేనుడు గ్రహించలేదు. సేనాపతి, కేతుని బుద్ధి గ్రహించి రాజుకు ఏ అపాయం రాకుండా చూసుకుంటున్నాడు. ప్రతాప వర్మ మహారాజుకు అండగా వుంటున్నాడు అనే విషయం మహమంత్రి కేతునకు తెలియదు. రాజును చంపాలి అనుకుంటే ముందు ప్రతాపవర్మ ను బుజ్జగించాలి, ఆశ చూపాలి అనుకుని ప్రతాపవర్మ ఒంటరిగా వున్న సమయంలో వెళ్ళాడు. ఆ సమయంలో ప్రతాపవర్మ ఆయుధాలు చూస్తూ ఉన్నాడు.వెంటనే ప్రతాపవర్మ చెవిలో ఇలా చెప్పాడు. అది వినగానే ప్రతాపవర్మ ఎగిరి గంతేసి ", మరి ఎప్పుడు వీరసేనుని మట్టు పెడదాం "అన్నాడు."ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్న ప్రతాప్ "అని విషపు నవ్వు నవ్వాడు. ప్రతాపవర్మ కూడా ఆ నవ్వుతో శృతి కలిపాడు. ప్రతాపవర్మ మహా మంత్రి దుష్ట బుద్ది తెలుసుకుని అప్ర మత్తు డైనాడు. ఒక రోజు ఉద్యాన వనంలో వీరసేనుడు ఒంటరిగా ఏకాంతo గా వున్న క్షణంలో కేతుడు, ప్రతాపవర్మకు సైగ చేశాడు. మహా మంత్రి ముసుగు ధరించి హట త్తుగా రాజును బంధించాడు. ప్రతాపవర్మకు సైగ చేసే లోపు, ప్రతాపవర్మ కూడ ముసుగు ధరించి మంత్రి ని బంధించాడు. ఊహించని పరిణామానికి హడాలిపోయాడు మహా మంత్రి. వీర సేనుడిని, మహా మంత్రిని కోటలోకి తీసుకుపోయాడు ముసుగు లో వున్న ప్రతాపవర్మ. "రాజా ముందు ఈ ముసుగు వ్యక్తి ముసుగు తొలగించి చూడండి "అన్నాడు ప్రతాపవర్మ ముసుగు తీయకుండానే. మహారాజు వీరసేనుడు ఆ వ్యక్తి ముసుగు తొలగించి ఆశ్చర్య పోయాడు "నువ్వా!"అన్నాడు.

సరిగ్గా అప్పుడే ప్రతాపవర్మ కూడా ముసుగు తొలగించుకుని రాజు ముందు తల వంచుకుని నిలబడ్డాడు. ప్రతాపవర్మ అనుకున్నాడు రాజు మనసులో."అవును మహారాజా!నేనే ఈ దుష్ట మంత్రి మిమ్మును సంహారించి ఈ రాజ్యానికి రాజు కావాలనుకున్నాడు. నాతో చేతులు కలిపాడు. అనాది నుంచి మా వంశం మీకు రక్షణగా ఉంది. మిమ్ములను కాపాడుకోవాలనే మహా మంత్రి తో చేతులు కలిపి నాటకం ఆడాను "అన్నాడు వినయంగా. రాజు వీరసేనుడు దుష్ట మంత్రి పన్నాగం తెలుసుకుని "అంతా వరకు వచ్చిందా "అనుకుని "మీకు ఈ రాజ్యమే కావాలి అనుకుంటే " అంటూ తన కత్తి తో పొడుచుకోబోయాడు.ప్రతాపవర్మ చట్టుక్కున మహారాజు ను ఒడిసి పట్టుకుని "మీరు పది కాలాల పాటు ఉండాలి. మా సేవ అంతా మీ రక్షణకే మీరు చిరకాలం జీవించాలి. ఈ ప్రతాపవర్మ అవినీతికి, కుట్రలకు, అధికారానికి ఎన్నడు లొంగడు. రాజుల సేవే మా లక్ష్యం "అన్నాడు. తన పన్నాగం తెలిసిందని మహా మంత్రి పారిపోతుండగా మెరుపు వేగంతో మంత్రిని పట్టుకున్నాడు ప్రతాపవర్మ."ఎవరక్కడ "మహారాజు అనగానే భట్టులు వచ్చారు. "ఈ దుష్ట మంత్రిని కారాగారంలో వేయండి. రేపే ఉరి "అనగానే రాజు ప్రతాప వర్మను ఆలింగనం చేసుకుని మా నమ్మక సేనాని ప్రతాప వర్మకు జై అని వీరసేనుడు గట్టిగా పలికాడు. సాక్షాత్తు రాజు తో జై కొట్టించు కోవడంతో ప్రతాపవర్మ "వీరసేన మహారాజు వర్ధిల్లాలి" అన్నాడు.

కనుమ ఎల్లారెడ్డి, 9391523027


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్