Magazines

రేపు ముంబయికి ముఖ్యమంత్రి

1 గంట క్రితం

Chief Minister
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

తుమ్మిడి హెట్టిపై మహారాష్ర్టతో చర్చలు
కేఆర్‌ఎంబీ సమావేశం మంగళవారానికి వాయిదా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రాణహిత నదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై మహారాష్ర్టతో మరోసారి చర్చించేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి సోమవారం ముంబయికి వెళ్లనున్నారు. సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో జరిగిన భేటీ ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రీ ఫీజబులిటీ రిపోర్టు (పీఎఫ్‌ఆర్‌) సమర్పించిన తర్వాత మరో 15 రోజులకు మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. అయితే రేవంత్‌ సర్కార్‌ ‌మాత్రం ఇప్పటి వరకు రిపోర్టును సీడబ్ల్యూసీకి అంద జేయలేదు. ‌దీంతో నీటి లభ్యతపై తాజా గణాంకాలు, ముంపుపై స్పష్టమైన వైఖరితో రావాలని మహారాష్ట్ర తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ర్ట సీఎం ఫడ్నవీస్‌‌తో చర్చించేందుకు సీఎం సోమవారం ముంబయికి వెళ్లనున్నారు. అదే రోజు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) 21వ సమావేశం వాయిదా పడింది. తుమ్మిడిహట్టి విషయమై చర్చించేందుకు సీఎంతో పాటు ముంబయి వెళ్లాల్సి ఉన్నందున బోర్డు సమావేశానికి హాజరవటం వీలు కాదని తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ రమేశ్‌ ‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన కేఆర్ఎంబీకి లేఖ రాశారు. సోమవారం తలపెట్టిన సమావేశం వాయిదా వేయాలని కోరారు. తెలంగాణ విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తదుపరి సమావేశాన్ని మంగళవారం నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం అందించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్