Magazines

బ్యాంకులను ప్రయివేటీకరించొద్దు

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 2 నిమిషాల చదవడం

సీపీఐ(ఎం) పొలిట్‌‌బ్యూరో

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లోని 60.72శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేసింది. భారతీయ బ్యాంకుల్లో విదేశీ సంస్థల వాటా 26 శాతా నికి మించి ఉండరాదని రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతు న్నా, వాటిని కేంద్రం ఉల్లంఘిస్తున్నదని విమర్శించింది. ఫెయిర్‌ఫాక్స్‌కు ఇప్పటికే క్యాథలిక్ సిరియన్ బ్యాంక్‌లో 40శాతం వాటా ఉందని తెలిపిం ది. వరుసగా ఐదేండ్ల పాటు భారీ నష్టా లు చవిచూసిన ఐడీబీఐ బ్యాంక్, ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఎల్‌ఐసీ 51శాతం వాటా కొనుగోలు చేసిన తర్వాత లాభాలు ఆర్జిస్తోందని పొలిట్‌ బ్యూరో పేర్కొంది. అలాంటి బ్యాంకు ను ఇప్పుడు విక్రయించడం సరి కాదని అభి ప్రాయపడింది. ఫెయిర్‌ ఫాక్స్‌కు లబ్ధి చేకూర్చేందుకే ఐడీబీఐ షేర్ల ధరను గతంలో ఉన్న విలువ కంటే తగ్గించారన్న అను మానా లున్నాయని సీపీఐ(ఎం) స్పష్టం చేసింది. పలు వివాదాల నేపథ్యం లో గతంలో ఫెయిర్‌ ఫాక్స్‌కు, దాని ఆడిటర్లకు రూ.50 లక్షల జరిమానా విధించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసింది. అంతే కాదు, లాభాల్లో నడుస్తున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకు లను కూడా ప్రయి వేటీక రించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినట్లు వార్తలు వస్తున్నాయని సీపీఐ(ఎం) పేర్కొంది.

ప్రయివేటీకరణ వల్ల సామాజిక రంగాలకు ఇచ్చే రుణాలు, చిన్న డిపాజి టర్ల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని పొలిట్‌బ్యూరో హెచ్చరించింది. దేశంలో అసమానతలు పెరుగుతున్న తరుణంలో బ్యాంకింగ్ సేవలను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో, అందరికీ రుణ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులపై పెద్ద బాధ్యత ఉందని స్పష్టం చేసింది. అందువల్ల వాటి వాటాల ఉపసం హరణ ప్రణాళికలను ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్