Magazines

హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త

1 గంట క్రితం

travelers
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

రూ 600లకే వారం పాటు ఏసీతోసహా అన్ని బస్సుల్లో ప్రయాణం
సరికొత్త పథకాన్ని ప్రారంభించిన ఆర్టీసీ ఎమ్‌డీ వై.నాగిరెడ్డి


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికులు, పర్యాటకులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. క్యూరి పరిధిలో ప్రయాణించే వారికి ఆర్టీసీ సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులకు ఆర్థిక భార తగ్గించడంతోపాటు సులభతరమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో రూ. 600 ధర కలిగిన ‘వీక్లీ బస్ పాస్’ను టీఎస్‌ ఆర్టీసీ ఎమ్‌‌డీ వై నాగిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ పాస్ కొనుగోలు చేసిన రోజు నుంచి వరుసగా ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. తద్వారా ప్రయాణికులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏసీ బస్సులతోసహా అన్ని రకాల సిటీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించవచ్చు. ఈ పాస్‌ ‘పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్’ సర్వీసులకు మాత్రం వర్తించదు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోజువారీ పాస్, నెలవారీ పాస్ సౌకర్యాలకు అదనంగా, ప్రయాణికులకు మరొక చవకైన, అనుకూలమైన ప్రయాణ ఎంపికను అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ఈ సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో స్వల్పకాలిక బస కోసం వచ్చే పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు మరియు వారం రోజుల పాటు నిరంతరం క్యూర్ పరిధిలో ప్రయాణిం చాల్సిన వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వారంతపు పాస్ వల్ల ప్రయాణికులు ఏడు రోజుల వ్యవధిలో వేర్వేరుగా టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరముండదు. ఒక్కసారి పాస్ తీసుకుంటే ఏడు రోజుల పాటు నగరంలో ఏ సిటీ బస్సులోనైనా (పుష్పక్ బస్సు మినహా) నిరభ్యంతరంగా, వేగంగా ప్రయాణించవచ్చు. వీక్లీ పాసులు నగరంలోని అన్ని సిటీ బస్ పాస్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. అవసరమైన వారు తమ సమీపంలోని బస్ పాస్ కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చు తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్