Magazines

నవతెలంగాణ సిబ్బందికి వృత్తి శిక్షణ తరగతులు

1 గంట క్రితం

Vocational training classes for 'Nava Telangana' staff
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

నవతెలంగాణ పత్రికలో పనిచేస్తున్న మార్కెటింగ్, సర్కులేషన్, రికవరీ విభాగాలకు చెందిన సిబ్బందికి ఆదివారం రాష్ట్రస్థాయిలో వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ తరగతుల్లో వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై ప్రముఖ పబ్లిక్ స్పీకింగ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ ఆనంద్ పర్జన్య, టీమ్ వర్క్, బిజినెస్, మార్కెటింగ్ స్కిల్స్ పైన డాక్టర్ మహిపతి శ్రీనివాసరావు శిక్షణనిచ్చారు. మార్కెట్ పరిస్థితులు, సమన్వయం, ఆటంకాలు అధిగమించడం తదితర అంశాలపైన సబ్ కమిటీ సభ్యులు, హైదరాబాద్ రీజియన్ జనరల్ మేనేజర్ లింగారెడ్డి వివరించారు. హెచ్ఆర్ జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డి ప్రిన్సిపల్ గా వ్యవహరించారు. ఏడీవీటీ జనరల్ మేనేజర్ వెంకటేష్, మేనేజర్ వీరయ్యలతో పాటు వివిధ విభాగాల సిబ్బంది శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్