Magazines

నాటి మద్దతు నేడేది ?

1 గంట క్రితం

support
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 2 నిమిషాల చదవడం

ట్రంప్ ఆర్థిక నిర్వహణపై యువత పెదవి విరుపు

కుంగదీస్తున్న ద్రవ్యోల్బణం

రిపబ్లికన్లపై ‘జెన్ జీ’లో సడలుతున్న విశ్వాసం

వాషింగ్టన్ : అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండో పదవీకాలంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు పైన, దేశ భవిష్యత్తు పైన అక్కడి యువత తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారని తాజా జాతీయ సర్వేలు, అంతర్జాతీయ కథనాలు స్పష్టం చేస్తున్నాయి. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌కు అండగా నిలిచిన యువ ఓటర్లు... ముఖ్యంగా పురుషులు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆయనకు, రిపబ్లికన్ పార్టీకి దూరమవుతున్నారు. హార్వర్డ్ యూత్ పోల్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం 77 శాతం మంది యువ అమెరికన్లు ట్రంప్ ఆర్థిక విధా నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశం సరైన దారిలోనే నడుస్తోందని చెప్పిన వారి సంఖ్య కేవలం తొమ్మిది శాతమే.

పోల్స్ ఏమంటున్నాయి ?

న్యూయార్క్ టైమ్స్/సియానా కాలేజ్ పోల్ నిర్వహించిన సర్వే ప్రకారం 18 - 29 సంవత్సరాల మధ్య వయసున్న యువతలో 86 శాతం మంది ట్రంప్ ఆర్థిక నిర్వహణను తప్పుపట్టారు. కేవలం 16 శాతం మందే ఆయన ఆర్థిక పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎన్‌బీసీ పోల్‌లో ట్రంప్ నికర ఆర్థిక ఆమోద రేటు మైనస్ 31 శాతానికి పడిపోయింది. ఇది ఆయన రెండు విడతల పాలనలోనే అత్యంత కనిష్టం. ట్రంప్‌పై యువతలో విశ్వాసం సన్నగిల్లడానికి కారణాలేమిటి అనే విషయాన్ని పరిశీలిస్తే అనేక అంశాలు ముందుకొచ్చాయి. ముఖ్యంగా రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు యువతను బాగా కుంగదీస్తున్నాయి. ఆహార పదార్థాలు, కిరాణా సామగ్రి, గ్యాస్ ధరలు బాగా పెరగడంతో నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. దేశంలో సుమారు 60 శాతం మంది యువతీయువకులు స్వతంత్రంగా ఉండలేక తల్లిదండ్రులతోనే ఇప్పటికీ నివసిస్తున్నారు. దానికి కారణంగా ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకడమే. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్న వారి సగటు వయసు 40 ఏండ్లకు పెరిగింది. జీతాలు పెరగక పోవడంతో రోజువారీ ఖర్చుల కోసం అదనపు పనులు చేయడం అక్కడ అనివార్యమవుతోంది.

‘మాగా’పై సడలిన నమ్మకం

2024 ఎన్నికల్లో ట్రంప్ సాధించిన విజయంలో యువ పురుషుల (జెన్ జీ పురుషులు) పాత్ర ఎంతో కీలకమైనది. అయితే తాజాగా సీఎన్ఎన్ నిర్వహించిన పోల్ ప్రకారం ట్రంప్ యొక్క ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) ఉద్యమంపై వారు నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఇరాన్‌లో ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం, కొనసా గుతున్న ఆర్థిక పరమైన ఒత్తిడులే దీనికి కారణం. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న 30 సంవత్సరాల లోపు వయసున్న యువకుల్లో 58 శాతం మంది డెమొక్రాట్లకు మద్దతు తెలుపు తుంటే రిపబ్లికన్లను కేవలం 32 శాతం మంది మాత్రమే సమర్ధిస్తున్నారని హార్వర్డ్ సర్వే తెలియజేసింది. మధ్యంతర ఎన్నికల వేళ ఈ పరిణామం రిపబ్లికన్లను తీవ్రంగా కలవర పరు స్తోంది. మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ విధా నాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని 63 శాతం మంది రిజిస్టర్డ్ యువ ఓటర్లు తేల్చి చెప్పారు.

రిపబ్లికన్లకు ఆధిక్యత అసాధ్యమే

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌పై రిపబ్లికన్లు ఆధిపత్యం సాధించడం అసాధ్యమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తమ భవిష్యత్తుపై రోజురోజుకూ నిరాశావాదంతో ఉన్న తరంలో ట్రంప్‌పై అసంత ప్తి పెరిగిపోతోంది. ముందస్తు ఓటింగ్ డేటా ప్రకారం అనేక కీలక రాష్ట్రాల్లో...ముఖ్యంగా యువ ఓటర్లలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. ఈ పరిణామం రిపబ్లికన్లకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్