Magazines

సర్‌తో ప్రజాస్వామిక హక్కులకు ముప్పు

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 2 నిమిషాల చదవడం

దళితులు, ఆదివాసీలు, మైనార్టీల ఓటు హక్కులకు విఘాతం : రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, స్కైలాబ్‌ బాబు

మూమెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ (ఎంపీజే) ఆధ్వర్యంలో నిరసన

నవతెలంగాణ-ముషీరాబాద్‌

సర్‌తో దళితులు, ఆదివాసీలు, మైనార్టీ ప్రజల ప్రజాస్వామిక హక్కులకు ముప్పు ఏర్పడుతుందని రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు తెలిపారు. ఈ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసేంత వరకు ప్రజాసంఘాలన్నీ ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సర్‌ ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మూమెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ (ఎంపీజే) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాసంఘాల నాయకులు, ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్‌కు, జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సర్‌ ప్రక్రియలో చనిపోయినవారి ఓట్లు, డబుల్‌ ఓట్లు, చొరబాటుదారుల ఓట్లు తొలగించకుండా బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన ఓట్లను తొలగిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. సర్‌ ప్రక్రియ కారణంగా దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు అభద్రతాభావానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రజాస్వామిక హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందని తెలిపారు. సర్‌ ప్రక్రియను తక్షణమే రద్దు చేసి, దేశంలో రాజ్యాంగ విలువలను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని నాయకులు విమర్శించారు. ఆయన రాజీనామా చేసేంత వరకు ఐక్యంగా పోరాటాలు కొనసాగించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు, ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్