Magazines

రజక వృత్తిదారుల సంక్షేమానికి పెద్ద పీట వేయాలి

1 గంట క్రితం

Priority must be given to the welfare of those in the laundry profession.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

సంఘం 26వ ఆవిర్భావ సభలో వక్తలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రజక వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని వక్తలు డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం 26వ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్‌‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సి.వెంకట స్వామి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చేతి వృత్తిదారుల రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎన్వీ.రమణ మాట్లాడుతూ రజక వృత్తిదారుల హక్కుల కోసం తెలంగాణ రజక వృత్తిదాల సంఘం అహర్నిశలు కృషి చేస్తోందని కొనియాడారు. క్షేత్రస్థాయిలో రజక వృత్తిదారుల సామాజిక, ఆర్థిక వృద్ధికి పోరాడుతోందని అన్నారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో 2021లో పురుడు పోసుకొని అమరుడు సత్తెనపల్లి రామకృష్ణ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి అయిలమ్మ స్ఫూర్తితో అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. సంక్షేమ చర్యలు, బడ్జెట్లో వాటా కై చలో అసెంబ్లీ, సంక్షేమ భవన ముట్టడి, కలెక్టర్ కార్యాలయం ముందు చాకి రేవు మొదలగు నిరసనల ద్వారా ప్రభుత్వాలని కదిలించిందని అన్నారు.

వృత్తి ఆధునికరణ, ఉపాధి కల్పన నినాదంతో ఆధునిక ధోబి ఘాట్లు, లాండ్రీ వర్కర్స్ కి ఉచిత విద్యుత్ పథకం, ప్రభుత్వ సంస్థల దోబీ వృత్తి పని వృత్తిదారులకే ఇవ్వాలనే జీవోలు సాధిం చిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తి దారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియాల గోపాల్, రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వినర్ సిహెచ్.నగేష్, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ నాయకులు లోంక సోమన్న, భాస్కర్ రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్